- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొబైల్, ఇంటర్నెట్ ఏమీ వాడను : అజిత్ డోవల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా తాను విధులు నిర్వహిస్తానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా తాను విధులు నిర్వహిస్తానని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ రెండింటికి తాను చాలా దూరంగా ఉంటానన్నారు. కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లో ఉన్నవారితో ఎమర్జెన్సీ సమయాల్లో మాట్లాడేందుకే ఫోన్ ఉపయోగిస్తానని తెలిపారు. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఫోన్, ఇంటర్నెట్టే అక్కర్లేదని, అందుకు చాలా మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజలకు తెలియని కొన్ని పద్ధతులను వారికి తెలియ జెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవం వల్ల లాభాలు ఉన్నా.. భద్రతా పరంగా సవాళ్లు కూడా పెరిగాయని, దానిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేటి కాలంలో ఫోన్, ఇంటర్నెట్ లేకుండా జీవించడం కష్టమని అందరూ భావిస్తున్న తరుణంలో, తాను మాత్రం వీటికి దూరంగా ఉంటూనే అత్యంత కీలకమైన జాతీయ భద్రతా బాధ్యతలను నిర్వహిస్తున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.






