- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > NDA సర్కార్ మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌కు మరోసారి చాన్స్
NDA సర్కార్ మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌కు మరోసారి చాన్స్
కేంద్రంలో ఇటీవల కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఇటీవల కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జాతీయ భద్రతా సలహాదారు పదవిలో ప్రస్తుతం కొనసాగుతోన్న దోవల్.. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిని చేపట్టారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ మూడోసారి కూడా అజిత్ దోవల్‌కు అవకాశం కల్పించింది. దీంతో వరుసగా మూడుసార్లు ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా అజిత్ దోవల్ రికార్డ్ సృష్టించారు. యూరి సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు భారత్ చేపట్టిన ఇతర ప్రతిష్టాత్మక అపరేషన్లలో అజిత్ దోవల్‌ది మాస్టర్ మైండ్. దీంతోనే మరోసారి కేంద్రం ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
Next Story






