Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టిన అజిత్ దోవల్

by S Gopi |   (  Updated:2025-07-11 10:59:02  IST  )

ఆపరేషన్ సింధూర్‌లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పోషించిన పాత్ర గురించి మరోసారి పంచుకున్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టిన అజిత్ దోవల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు, మన ప్రజలపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి జరిగే తప్పుడు ప్రచారంపై జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పోషించిన పాత్ర గురించి మరోసారి పంచుకున్నారు. చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ దోవల్.. ఆపరేషన్ సిందూర్ మిషన్ ఖచ్చితత్వం, విజయానికి మన సొంత టెక్నాలజీ సహకరించిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. మే 7 తెల్లవారుజామున నిర్వహించిన ఈ ఆపరేషన్ కేవలం 23 నిమిషాలు మాత్రమే ముగిసిందని అన్నారు. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను వాటి సరిహద్దులకే పరిమితం కాకుండా, ఆయా స్థావరాల కేంద్రాలే టార్గెట్‌గా దాడులు చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా పాశ్చాత్య మీడియా భారత్‌కు నష్టం కలిగిందని ప్రచారం చేస్తున్న దానిపై అజిత్ దోవల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలను నిర్ద్వందంగా ఖండిస్తూనే, నష్టం జరిగినట్టు నిరూపించాలని సవాలు విసిరారు. పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని రుజువు చేసే ఒక్క సాక్ష్యం అయినా చూపించగలరా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, కొన్ని విదేశీ వార్తా సంస్థలు ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఏదేదో చేసిందని అవాస్తవ కథనాలు ప్రసారం చేశాయన్నారు. పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయనేది స్పష్టమైన సమాచారంతోనే మనసైన్యం దాడులు చేసింది. ఆ దేశంలోని 13 వైమానిక స్థావరాల్లో జరిగిన దాడి గురించి ఫోటోలు వచ్చాయి, కానీ భారత్‌లో జరిగిందని చెబుతున్న నష్టం గురించ్ ఒక్క ఫోటో కూడా లేదని వెల్లడించారు.

Next Story