- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పాక్‌లో అలజడి.. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటన
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో PoKను ఆనుకుని ఉన్న ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ (Indian Army), నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి మెరుపు దాడులు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో PoKను ఆనుకుని ఉన్న ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ (Indian Army), నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్ దాడితో పాకిస్థాన్ లో అలజడి రేగింది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను మూసివేసింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency in Pakistan) ప్రకటించింది. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాక్ పంజాబ్ లో విద్యాసంస్థల్ని మూసివేయాలని ఆదేశించారు.
పాకిస్థాన్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్ పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ (High Alert) ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Islamabad International Airport) ను మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన ఫ్లైట్స్ ను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.






