ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు.. విమానాల ఆలస్యంపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కీలక ప్రకటన

by Malleboina Mahesh |

చలికాలం తీవ్రతరం అవుతుండటంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు.. విమానాల ఆలస్యంపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: చలికాలం తీవ్రతరం అవుతుండటంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ (కనిపించే స్థాయి) తగ్గడంతో పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రయాణికులను హెచ్చరించింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత విమానయాన సంస్థల అధికారిక మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు ఆరా తీయాలని, విమానాశ్రయానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలని సూచించింది.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభావిత విమానాశ్రయాల్లో సహాయక బృందాలను రంగంలోకి దించినట్లు AAI తెలిపింది. అత్యవసర సమాచారం కోసం ప్రధాన విమానయాన సంస్థల కస్టమర్ కేర్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇండిగో (IndiGo): 01244973838, ఎయిర్ ఇండియా (Air India): 011 6932 9333, స్పైస్‌జెట్ (SpiceJet): 0124 4983410 / 7101600, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 0124 443 5600 / 693 5600, ఆకాసా ఎయిర్ (Akasa Air): 9606112131, అలయన్స్ ఎయిర్ (Alliance Air): 044-35113511 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించింది. అలాగే మరో రెండు మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Next Story