- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
బెంగళూరు విమానాశ్రయం నుంచి వారణాసికి తెల్లవారుజామున 5.10కి బయలు దేరిన 6E897 నెంబరు ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 6.16కు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు విమానాశ్రయం నుంచి వారణాసికి తెల్లవారుజామున 5.10కి బయలు దేరిన 6E897 నెంబరు ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 6.16కు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాంకేతిక ఇబ్బందులతో అత్యవసర ల్యాండింగ్ చేశామని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీంతో వారణాసికి వెళ్లే ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వేరే విమానంలో పంపినట్లు అధికారులు తెలిపారు. మొదట ఎందుకు ల్యాండింగ్ చేశారో, ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు.
Next Story






