భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. హైదరాబాద్‌-ఢిల్లీ టికెట్‌ ధర రూ.89 వేలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-05 10:21:01  IST  )

భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. హైదరాబాద్‌-ఢిల్లీ టికెట్‌ ధర రూ.89 వేలు

భారీగా పెరిగిన విమాన ఛార్జీలు.. హైదరాబాద్‌-ఢిల్లీ టికెట్‌ ధర రూ.89 వేలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఛార్జీలు భారీగా పెంచింది. హైదరాబాద్‌-ఢిల్లీ విమాన టికెట్‌ ధర రూ.89 వేలు, ఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ.40 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఒకే రోజు 500 పైచిలుకు విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లగేజీని వెనక్కు తెచ్చుకోలేక, కనీసం తిండి, తాగడానికి నీరూ లేక ఇక్కట్ల పాలయ్యామని పలువురు వాపోయారు. దీంతో, దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ రద్దీ కారణంగానే టికెట్ల రేట్లు పెంచినట్లు తెలుస్తోంది.

Next Story