- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aircraft crash: శిక్షణా విమానం కూలి పైలట్ మృతి.. గుజరాత్‌లో ఘటన
గుజరాత్‌లోని అమ్రేలిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక ప్రయివేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం అకస్మాత్తుగా కూలిపోయింది.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ (Gujarath)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమ్రేలిలో ఒక ప్రయివేట్ కంపెనీకి చెందిన శిక్షణా విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో భారీ శబ్దం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విమానం కుప్పకూలిన అనంతరం భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. ఈ ఘటనను అమ్రేలి పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ ఖరత్ (Sanjay karath) ధ్రువీకరించారు. మరణించిన పైలట్‌ను అనికేత్ మహాజన్ గా గుర్తించారు.
కాగా, గుజరాత్‌లో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు (FTO)లు అనేకం ఉన్నాయి. ప్రతి సంస్థ ఏటా 300 నుంచి 400 మందికి శిక్షణ ఇస్తున్నాయి. ఈ అకాడమీలు ప్రధానంగా చిన్న విమానాలతో శిక్షణ ఇస్తాయి, సోలో విమానాలు, క్రాస్-కంట్రీ నావిగేషన్, సిమ్యులేటర్ గంటలను అందిస్తాయి.భారతదేశంలో వాణిజ్య పైలట్లకు డిమాండ్ పెరుగుతుండడంతో ఇందులో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే డీజీసీఏ ఈ శిక్షణా సంస్థలపై నిఘా ఉంచినప్పటికి తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.






