- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో డేంజర్‌గా ఎయిర్ క్వాలిటీ.. ఫతేహాబాద్ కలెక్టర్‌కు నోటీసులు
గత కొద్దిరోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దిరోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికి పంజాబ్, హర్యాణాలో వరి కుప్పలను పెద్ద మొత్తంలో తగలబెట్టడం ప్రధాన సమస్యగా మారింది. అయితే ఈ వ్యవహరాంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ వారు సరైన రితీలో వరి అవశేషాల దహనంపై నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు. దీంతో , ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసు జారీ చేసింది.
పంట అవశేషాల దహనం పూర్తిగా నిలిపివేయాలని ఇప్పటికే పలు మార్లు సూచించినప్పటికీ, సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 6, 2025 వరకు 59 స్టబుల్ బర్నింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని కమిషన్ పేర్కొంది. నవంబర్ ప్రారంభం నుంచే అస్టబుల్ బర్నింగ్ సంఖ్య గణనీయంగా పెరగడం నిబంధనల అమలులో తీవ్ర వైఫల్యంగా పరిగణించబడింది. ఈ నేపథ్యంలో ఫతేహాబాద్ డిప్యూటీ కమిషనర్‌ను నవంబర్ 17, 2025 లోగా వివరణ సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.






