ఢిల్లీలో వాయు కాలుష్య కట్టడి: రంగంలోకి రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

by Malleboina Mahesh |

దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

ఢిల్లీలో వాయు కాలుష్య కట్టడి: రంగంలోకి రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా షాహీన్ బాగ్ వంటి కీలక ప్రాంతాల్లో రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీయూసీసీ (Pollution Under Control Certificate) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని, అలాగే నిర్మాణ సామాగ్రిని తరలించే ట్రక్కులను నగరంలోకి అనుమతించకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బీఎస్-6 వాహనాలను వాడాలని మంత్రి విజ్ఞప్తి

బీఎస్-4 (BS IV) కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి కల్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే వారు కేవలం భారత్ స్టేజ్ 6 (BS6) ప్రమాణాలు కలిగిన వాహనాలనే తీసుకురావాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ సహకరించాలని, కాలుష్య నివారణ నియమాలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Next Story