కరాచీని కూడా కొట్టాం..మాలిర్ కంటోన్‌మెంట్‌ను టార్గెట్ చేశాం: ఎయిర్ మార్షల్ ఏకే భారతి

by Phanindra |

‘ఆపరేషన్ సిందూర్’లో కరాచీని కూడా టార్గెట్ చేసి, అక్కడి మాలిర్ కంటోన్‌మెంట్‌ను కొట్టామని ఎయిర్ మార్షన్ ఏకే భారతి వెల్లడించారు.

కరాచీని కూడా కొట్టాం..మాలిర్ కంటోన్‌మెంట్‌ను టార్గెట్ చేశాం: ఎయిర్ మార్షల్ ఏకే భారతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్‌లోని కరాచీపై కూడా భారత దళాలు దాడి చేసినట్లు వాయుసేన ధ్రువీకరించింది. కరాచీలోని మాలిర్ కంటోన్‌మెంట్‌పై డ్రోన్లతో భారత్ దాడి చేసిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. మాలిర్ కంటోన్‌మెంటో‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సైట్ల వంటి మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తాము టార్గెట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కరాచీకి 35 కిలోమీటర్ల దూరంలో మాలిర్ కంటోన్‌మెంట్ ఉంటుంది. దీంతోపాటు లాహోర్‌, గుజ్రన్‌వాలాలోని రాడార్ సైట్లను కూడా తాము టార్గెట్ చేసినట్లు భారతి తెలిపారు.

లాహోర్‌లో చైనా తయారుచేసిన హెచ్‌క్యూ-9 రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న హార్పీ డ్రోన్లతో నాశనం చేసి ఉంటారని విశ్లేషకులు చెప్తున్నారు. కరాచీపై భారత నేవీ దాడి చేసిందంటూ వచ్చిన ఫేక్ న్యూస్‌కు ఇదే కారణం అయ్యుండొచ్చు. కరాచీని భారత్ టార్గెట్ చేసిందని కొందరికీ తెలిసుండొచ్చని, అయితే అది కేవలం డ్రోన్ల దాడికే పరిమితం అని తెలియక, భారత నేవీ కూడా రంగంలోకి దిగిందని ప్రచారం చేసుండొచ్చని విశ్లేషకుల భావన.

Next Story