అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ,ఏఏఐబీలకు సుప్రీం నోటీసులు

by Malleboina Mahesh |

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే పైలట్ తప్పిదం అన్న కథనాలు మీడియా ద్వారా బయటకు రావడం అనుచితమని కోర్టు ఫైర్ అయింది.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ,ఏఏఐబీలకు సుప్రీం నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash)లో 272 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ భారత దేశంతో పాటు ప్రపంచం మొత్తం షాక్ కు గురయింది. కాగా ఈ ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే (Negligence of pilots) కారణమై ఉంటుందని.. అంచనా నివేదిక లీక్ అయింది. దీంతో “సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్” అనే ఎన్‌జీఓ సంస్థ సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. ప్రమాదంపై అధికారిక విచారణలో పక్షపాతం ఉందనే అనుమానాలు వ్యక్తం చేసింది.

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)లకు నోటీసులు జారీ చేసింది. స్వతంత్రంగా, పారదర్శకంగా, వేగంగా విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో డీజీసీఏ భాగస్వామ్యం ఉండడం వల్ల ‘సంఘర్షణ-హిత పరిస్థితి’ (conflict of interest) తలెత్తే అవకాశం ఉందని పిటిషన్‌లో ప్రస్తావించినట్లు గుర్తు చేసింది.

సుప్రీంకోర్టు స్పష్టం ఆదేశాలు..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే పైలట్ తప్పిదం అన్న కథనాలు మీడియా ద్వారా బయటకు రావడం అనుచితమని కోర్టు ఫైర్ అయింది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) వంటి కీలక సాక్ష్యాలు ఇకపై బహిర్గతం చేయకూడదని సూచించింది. అలాగే ఈ ప్రమాదంపై విచారణను పూర్తిగా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరిపి, బాధ్యత వహించాల్సిన సంస్థలు, వ్యక్తులను స్పష్టంగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story