Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను సమర్పించిన ఏఏఐబీ

by S Gopi |

విమానానికి సంబంధించిన డేటా, సిబ్బంది, వాతావరణ పరిస్థితుల వంటి కీలకమైన అంశాలు అందులో ఉన్నట్టు తెలుస్తోంది.

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను సమర్పించిన ఏఏఐబీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) మంగళవారం తన ప్రాథమిక నివేదికను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారులకు సమర్పించింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 241 మందిని బలి తీసుకున్న ఈ ఘటనపై ప్రాథమిక ఫలితాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నివేదికతో ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్టు అయింది. ఇప్పటికిప్పుడు నివేదికలోని వివరాలను అధికారులు బహిర్గతం చేయలేదు. విమానానికి సంబంధించిన డేటా, సిబ్బంది, వాతావరణ పరిస్థితుల వంటి కీలకమైన అంశాలు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. వాటివల్ల ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపై కొంత స్పష్టత రావొచ్చు.

ప్రమాదం జరిగిన విమానం నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌లను ఏఏఐబీ ల్యాబ్‌కు తరలించారు. అందులో లభించే డేటాను పరిశీలించి ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. కాగా, ఈ దారుణ ప్రమాదం జరిగిన ఒకరోజులోనే ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగనంధర్ నేతృత్వం వహిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులతో పాటు ఏవియేషన్ మెడిసిన్, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు నిపుణులు, అమెరికాకు చెందిన జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) నిపుణులు ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులతో పాటు ఏవియేషన్ మెడిసిన్, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు నిపుణులు, అమెరికాకు చెందిన జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) నిపుణులు ఉన్నారు. ఈ వారంలోపు నివేదికను ప్రజల కోసం విడుదల చేస్తారు.

Next Story