- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: ‘టాటా సన్స్’ కీలక నిర్ణయం.. ఎయిరిండియా సలహాదారుగా ప్రదీప్ సింగ్ ఖరోలా
ఎయిరిండియా అడ్వైజర్‌గా మాజీ విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. సంస్థ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు దాని విక్రయ ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా (Air India) యాజమాన్యం టాటా సన్స్ (Tata Sons) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఎదుర్కొంటున్న నియంత్రణ పరమైన (Regulatory) అడ్డంకులను అధిగమించేందుకు మాజీ పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా (Rajiv Bansal)ను సీనియర్ అడ్వైజర్‌గా నియమించింది. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ప్రదీప్ సింగ్ ఖరోలా గతంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా, ఎయిరిండియా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు దాని విక్రయ ప్రక్రియలో (divestment) కీలక పాత్ర పోషించారు.
అయితే, ప్రస్తుతం ఎయిరిండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విలీన ప్రక్రియ తుది దశలో ఉంది. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), పౌర విమానయాన శాఖ నుంచి వచ్చే నిబంధనలు, అనుమతులు, వ్యూహాత్మక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఖరోలా అనుభవం టాటా గ్రూప్‌కు ఎంతగానో తోడ్పడనుంది. ఎయిరిండియా కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం పెంచుకోవడంలో ప్రదీప్ సింగ్ ఖరోలా నియామకంలో కీలక కానుంది.






