- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదం వెంటనే పార్టీ చేసిన ఎయిరిండియా సిబ్బందిపై కఠిన చర్యలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Flight Accident) వలన చుట్టూ విషాదం నెలకొన్న వేళ అదే సమయంలో ఎయిరిండియా గ్రౌండ్ సర్వీస్ సిబ్బంది జరిపిన కార్యాలయ వేడుక తీవ్ర ఆగ్రహానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Flight Accident) వలన చుట్టూ విషాదం నెలకొన్న వేళ అదే సమయంలో ఎయిరిండియా గ్రౌండ్ సర్వీస్ సిబ్బంది జరిపిన కార్యాలయ వేడుక తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనలో 275 మంది మరణించగా.. ఇప్పటికీ బాధిత కుటుంబాలు బీభత్స దృశ్యాల నుంచి తేరుకోలేదు.
ఈ నేపథ్యంలో.. గురుగ్రామ్‌లోని ఎయిరిండియా సర్వీసెస్ (AISATS) కార్యాలయంలో జరిగిన సందడిపై విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్ ఉద్యోగులు సహా పలువురు సిబ్బంది మ్యూజిక్ DJతో కలిసి డ్యాన్స్ చేస్తూ విందులో పాల్గొన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయినవారు ఇంకా శవాలను సైతం చూడలేని పరిస్థితుల్లో ఉండగా, ఉద్యోగులు సెలబ్రేషన్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి స్పందించిన సంస్థ.. బాధ్యతారహిత ప్రవర్తనకు పాల్పడిన నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరింది. మిగతా సిబ్బందికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
సింగపూర్‌కు చెందిన SATS లిమిటెడ్‌తో భాగస్వామ్యంలో ఉన్న AISATS సంస్థ, దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో భోజనం, సామగ్రి నిర్వహణ సేవలు అందిస్తుంది. సంస్థ విడుదల చేసిన ప్రకటనలో సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని తెలిపింది. ప్రస్తుత పరిణామాలు, ఎయిర్‌లైన్స్ రంగంలోని ప్రొఫెషనల్ నైతికతలపై చర్చకు దారి తీస్తున్నాయి.






