ఎయిరిండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కాల్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 12:37:28  IST  )

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన ఘటన దేశం మరువక ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఎయిరిండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కాల్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన ఘటన దేశం మరువక ముందే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఓ విమానానికి ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌ (Thailand)లోని ఫుకేట్ (Phuket) నుంచి ఢిల్లీ (Delhi)కి వస్తున్న ఎయిరిండియా సంస్థకు చెందిన AI 379 ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు అండమాన్ సముద్రంపై విమానాన్ని చక్కర్లు కొట్టించి తిరిగి థాయ్‌లాండ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సమయంలో విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం ఫ్లై్ట్ మొత్తాన్ని అక్కడి భద్రతా సిబ్బంది, బాంబు స్వ్కాడ్ అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా సోదాలు చేపట్టి బాంబు లేదని తేల్చారు. దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరింది.

Next Story