- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash.. Flash : విమాన ప్రమాదంలో 242 మంది మృతి..!
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 171 గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది నిమిషాలకే భయంకర ప్రమాదానికి గురైంది. విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కూలిపోవడంతో, దాంతో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు , సిబ్బంది అందరూ దుర్మరణం చెందినట్లు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ ఘోర ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 171 గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది నిమిషాలకే భయంకర ప్రమాదానికి గురైంది. విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కూలిపోవడంతో, దాంతో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు , సిబ్బంది అందరూ దుర్మరణం చెందినట్లు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం అంతర్జాతీయ వార్త సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (AP) కు తెలిపారు.
విమానంలో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు, ఇతర సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. కూలిన ప్రాంతం నివాస ప్రాంతం కావడంతో కొంతమంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశముందని కమిషనర్ మలిక్ తెలిపారు. ఇంకా ఓ సంచలన అంశంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా విమానంలో ఉండి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడవుతోంది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే భారత సాయుధ బలగాలు, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రమాద స్థలంలో మెడికల్ టీమ్స్, ప్రత్యేక రికవరీ యూనిట్లు పనిచేస్తున్నాయి.
ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సంఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి అన్ని అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. అహ్మదాబాద్‌లోని అన్ని సంబంధిత విభాగాలను హై అలర్ట్పై ఉంచాలని ఆదేశించారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అనిపించిందని చెప్పారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కళాశాల డాక్టర్ల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌పై విమానం కూలడంతో ఆ భవనానికి తీవ్ర నష్టం ఏర్పడింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలు రాబోయే గంటల్లో వెల్లడయ్యే అవకాశముంది.






