వైడ్‌ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను తగ్గించిన ఎయిరిండియా

by Naga Rani Yarlagadda |

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ AI171) జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురై.. విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా మరణించిన విషయం తెలిసిందే.

వైడ్‌ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను తగ్గించిన ఎయిరిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ AI171) జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురై.. విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా మరణించిన విషయం తెలిసిందే. దేశంలో దశాబ్దాలలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటనపై ఎయిర్ ఇండియా గురువారం ఒక ప్రకటన విడుదల చేసి, భద్రతా చర్యలను కఠినతరం చేయడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్యను 15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది.

ఎయిర్ ఇండియా ప్రకారం.. సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఆదేశించిన "మెరుగైన భద్రతా తనిఖీలు" (Enhanced Safety Inspection) కింద, వారి 33 బోయింగ్ 787-8/9 విమానాల్లో 26 ఇప్పటికే తనిఖీ చేసి.. సర్వీసుకు అనుమతించబడ్డాయి. మిగిలిన విమానాల తనిఖీలు రాబోయే రోజుల్లో పూర్తవుతాయని సంస్థ తెలిపింది. అదనపు జాగ్రత్తగా.. బోయింగ్ 777 ఫ్లైట్‌పై కూడా మెరుగైన భద్రతా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఈ తగ్గింపు నిర్ణయం వెనుక మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు, యూరప్, తూర్పు ఆసియా దేశాలలో రాత్రి సమయంలో విమానాశ్రయ నిషేధాలు, కొనసాగుతున్న భద్రతా తనిఖీలు, ఇంజనీరింగ్ సిబ్బంది, పైలట్‌ల జాగ్రత్తమైన విధానం వంటి కారణాలు ఉన్నాయని ఎయిర్ ఇండియా వివరించింది. గత ఆరు రోజుల్లో 83 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించడానికి, సర్వీసుల స్థిరత్వం, సామర్థ్యాల కోసం వైడ్-బాడీ విమానాలతో నడిచే అంతర్జాతీయ సర్వీసులను రాబోయే కొన్ని వారాల పాటు 15 శాతం తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ తగ్గింపు జూన్ 20 నుంచి ప్రారంభమై, కనీసం జులై మధ్య వరకు కొనసాగుతుంది.

Next Story