Air india: బోయింగ్ డ్రీమ్‌లైనర్లకు కొనసాగుతున్న చెకింగ్‌.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

by B.Srinivas |   (  Updated:2025-06-14 16:07:18  IST  )

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత భద్రతా తనిఖీలను పెంచాలని డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే.

Air india: బోయింగ్ డ్రీమ్‌లైనర్లకు కొనసాగుతున్న చెకింగ్‌.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భద్రతా తనిఖీలను పెంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తొమ్మిది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల వన్-టైమ్ భద్రతా తనిఖీని పూర్తి చేసినట్టు ఎయిర్ ఇండియా (Air india) తెలిపింది. మిగిలిన 24 విమానాల తనిఖీలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ‘తనిఖీల కారణంగా పలు సుదూర మార్గాల్లో ప్రమాణించే విమానాలు ఎక్కువ సమయం పట్టొచ్చు లేదా ఆలస్యం కావొచ్చు, ముఖ్యంగా కార్యకలాపాలు నిలిపివేయబడిన విమానాశ్రయాలలో ఏవైనా ఆలస్యంగా నడిచే విమానాలుంటే ప్రయాణికులకు తెలియజేస్తాం’ అని తెలిపింది.

డీజీసీఏ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు పేర్కొంది. బోయింగ్ 787 విమానాలు భారతదేశానికి తిరిగి రాకముందే తనిఖీలు నిర్వహిస్తున్నామని, తద్వారా వాటిని తదుపరి కార్యకలాపాలకు అనుమతించే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద 26 బోయింగ్ 787-8, ఏడు బోయింగ్ 787-9 విమానాలు ఉన్నాయి.

Next Story