- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఈ సంఘటన రాంచీలో చోటు చేసుకుంది.

Air Ambulance from Ranchi crashed in jungle near Chatra
దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ( Ranchi) పెను విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ అంబులెన్స్ ( Air Ambulance ) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. కాసేపటి క్రితమే జార్ఖండ్ లోని ( Jharkhand) ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాంచీ నగరం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఎయిర్ ఆంబులెన్స్ కుప్పకూలినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాద సంఘటన జరిగినప్పుడు విమానంలో ఏకంగా ఏడుగురు ఉన్నట్లు గుర్తించారు.
ఇందులో ఒక రోగి, డాక్టర్ తో పాటు ఓ పారామెడిక్ ఉన్నారు. వాళ్లతో పాటు ఒక పైలట్, కో పైలట్ అలాగే ఇద్దరు సహాయకులు కూడా ఉన్నారు. ఇలా మొత్తంగా ఏడుగురు ఈ విమానంలో ప్రయాణించారు. ఇందులో ఒకరు మరణించినట్లు ఇప్పటికే గుర్తించారు అధికారులు.
41 సంవత్సరాల సంజయ్ కుమార్ ఈ ప్రమాద సంఘటనలో మరణించినట్లు అధికారులు ప్రకటన చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలియగానే ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ సంఘటనపై ఆరా తీస్తోంది. అటు ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం పొంచి ఉందట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






