- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
భారత్‌లో "500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతోంది" అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో "500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతోంది" అని ప్రధాని మోడీ (Prime Minister Modi) చేసిన వ్యాఖ్యలపై AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1992లో బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో కూల్చివేశారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేత అనేది చట్ట పాలన ఉల్లంఘన అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి "500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతోంది" అని అనడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టలేదని సుప్రీంకోర్టు (Supreme Court) చెప్పినప్పుడు, ప్రధాని ఈ మాట ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 6, 1992న కూల్చివేసింది మసీదును మాత్రమే కాదని, ఆ రోజు కరసేవకులు భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచారని.. అందుకే ఈ రోజును 'బ్లాక్ డే'గా పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన వలన ఏర్పడిన గాయాలు మసీదు కూల్చివేతకు సంబంధించినవి కాదు, రాజ్యాంగం బలహీనపడటం వలన ఏర్పడ్డాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi) స్పష్టం చేశారు.






