- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా కన్నా.. వాయుకాలుష్యమే డేంజర్: ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
కరోనా కన్నా వాయుకాలుష్యమే డేంజర్ అని, దీని కారణంగా 2024లో ఏకంగా 81 లక్షల మంది మరణించారని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కాలుష్యం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యం ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పిన ఆయన.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ భూతానికి ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. గతంలో వలె వాయు కాలుష్యం కేవలం శ్వాససంబంధిత వ్యాధులను కలిగించడం లేదని, పూర్తి శరీరంపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘ముఖ్యంగా పీఎం 2.5, అలాగే 0.1 మైక్రాన్ల కన్నా చిన్నవవైన కణాలు కేవలం ఊపిరితిత్తుల్లోనే ఆగిపోవు. రక్తంలో చేరి శరీరమంతా వ్యాపిస్తాయి. దీంతో వాపు, రక్తనాళాల మూసుకుపోవడం వంటి సమస్యలు వచ్చి, చివరకు గుండెపోటు, స్ట్రోక్, చివరకు డిమెన్షియా వంటి సమస్యలకు దారితీస్తుంది’ అని డాక్టర్ గులేరియా వివరించారు.
అందుకే చాలా అంతర్జాతీయ సంస్తలు కూడా గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా వాయుకాలుష్యాన్ని కారణంగా పరిగణిస్తున్నాయని ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయ గణాంకాలు గమనిస్తే 2024లో వాయుకాలుష్యం వల్ల 81 లక్షలమంది చనిపోయారు. ఇది కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కన్నా ఎక్కువ. ఇది కూడా మహమ్మారే. కానీ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది’ అని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు.






