- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. ఎయిమ్స్ వైద్యుల ప్రకటన
కొవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)పై ఎయిమ్స్ వైద్యులు(AIIMS Doctors) ప్రకటన విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine)పై ఎయిమ్స్ వైద్యులు(AIIMS Doctors) ప్రకటన విడుదల చేశారు. గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలకు వ్యాక్సిన్‌తో సంబంధం ప్రకటించారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించడం (Heart Attack Deaths) కలలకం రేపింది. ఈ వరుస మరణాలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు కచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాలు కనుగొనేందుకు ఒక కమిటీని ఏర్పా చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లను ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల పలు అధ్యయనాలు ఈ వ్యాక్సిన్లతో గుండెపోటు పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించాయన్నారు. దీనిపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. అయితే.. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఎయిమ్స్ వైద్యులు గురువారం ప్రకటన విడుదల చేశారు. గుండెపోటు మరణాలపై వ్యాక్సిన్‌తో సంబంధం లేదని తేల్చారు.






