AICC: నెహ్రూ ఆరోజు ఇదే చెప్పారు.. ఏఐసీసీ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |

ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం(AICC New Office) నేడు ప్రారంభమైంది.

AICC: నెహ్రూ ఆరోజు ఇదే చెప్పారు.. ఏఐసీసీ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం(AICC New Office) నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు(Congress Chief) మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Karge) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏఐసీసీ ఆఫీస్ ఫోటోలను షేర్ చేశారు. దీనిపై ఆయన.. ఈరోజు కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం మన పార్టీ చరిత్రలో ఒక మైలురాయి అని, కాంగ్రెస్ శాశ్వత కార్యాలయానికి "ఇందిరా భవన్" (Indira Bhavan) అని పేరు పెట్టడం గర్వకారణమని అన్నారు. అలాగే మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరు పెట్టబడిన ఈ భవనం మహిళా శక్తికి చిహ్నం అని, ఇది ఎల్లప్పుడూ మనందరికీ స్ఫూర్తిదాయక కేంద్రంగా ఉంటుందని చెప్పారు.

అంతేగాక డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన చారిత్రాత్మక సహకారాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా ఆయనకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంలోని లైబ్రరీని డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh) లైబ్రరీ అని పిలుస్తామని ఖర్గే ప్రకటించారు. త్యాగధనులు నిర్ణయించిన ఇదే ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడటం చాలా సంతోషకరమైన విషయమని, 1952 డిసెంబర్ 31న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawahar Lala Nehru) అధ్యక్షత వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) దీని గురించి చర్చించినట్లు గుర్తు చేశారు. ఆ రోజు నెహ్రూ.. ఏఐసీసీ ఆఫీస్ భవనం కోసం స్థలం కొనుగోలు ప్రశ్నను కమిటీ పరిగణించింది.. ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లో AICC ఆఫీస్ కోసం ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు." అని చెప్పినట్లు తెలిపారు.

అలాగే నెహ్రూ కోరిక ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉన్నానని, ఈ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన డిసెంబర్ 28, 2009న కాంగ్రెస్ 125వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ నాయకత్వంలో జరిగిందని, భవనం నిర్మాణ పనులు ఆమె పర్యవేక్షణలో పురోగమించాయని చెప్పారు. అందుకే దీనిని ప్రారంభించమని తాము సోనియాని అభ్యర్థించామని, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 1920ల నుండి 1947 వరకు స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత క్లిష్ట సమయంలో, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అలహాబాద్‌లోని స్వరాజ్ భవన్ అని, ఇందిరా గాంధీ ఇక్కడే జన్మించారని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత, ప్రధాన కార్యాలయం అలహాబాద్ నుండి ఢిల్లీకి మారిందని, 1969 వరకు, ఇది జంతర్ మంతర్ రోడ్‌లో, తరువాత రాజేంద్ర ప్రసాద్ రోడ్‌లో.. 1978 నుండి ఇప్పటివరకు ఇది అక్బర్ రోడ్‌లో ఉందని ఖర్గే వెల్లడించారు.

Next Story