Palaniswamy : బీజేపీకి షాకిచ్చిన AIADMK

by Muthe.Rajitha |

దక్షిణాదిన బీజేపీ(BJP)కి భారీ షాక్ తగిలింది.

Palaniswamy : బీజేపీకి షాకిచ్చిన AIADMK
X

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణాదిన బీజేపీ(BJP)కి భారీ షాక్ తగిలింది. తమిళనాడు(Tamilanadu)లో ఎలాగైనా పాదం మోపాలని అన్నాడీఎం(AIADMK)కేతో జట్టు కట్టిన కమలానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి(Palaniswamy) బీజేపీతో అన్నాడీఎం(BJP-AIDMK0కే పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో కూటమి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి ఎలాంటి భాగస్వామ్యం ఉండబోదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో కలిసి పని చేస్తామని చెప్పాము తప్ప ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని తామెక్కడా చెప్పలేదని పళనిస్వామి పేర్కొన్నారు.

అయితే తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని అన్నాడీఎంకే సీనియర్ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వక్ఫ్ బిల్లు(Waqf Amedament Bill)కు మద్ధతు తెలపకూడదని, ముస్లింలకు అన్యాయం జరగకూడదని తీర్మానించినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే పళనిస్వామి ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కూటమి చివరి వరకు నిలుస్తుందో లేదో అని అప్పుడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమిళ రాజకీయ విశ్లేషకులు.

Next Story