- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాట పూటకో ట్విస్ట్.. మళ్లీ విజయ్‌కి మద్దతుగా అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేల సమావేశం
విజయ్ కి మద్దతుగా అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. చెన్నైలోని సీవీ షణ్ముగం ఆఫీసులో 35మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. వీరంతా విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ఫలితాలు విడుదలైన తరవాత తమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకేకు 108 సీట్లు రాగా మెజార్టీ రావాలంటే మరో 10 సీట్లు అవసరం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి 5గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా మరో ఐదు సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 7న ప్రమాణస్వీకారం చేయాలనుకున్న విజయ్ కి గవర్నర్ షాక్ ఇచ్చారు. మెజార్టీ ఖరారు చేసిన తరవాతే సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే విజయ్ వామపక్షాలను సంప్రదించినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు తెలిపేందుకు నిరాకరించి డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో విజయ్ మళ్లీ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ కి మద్దతుగా అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. చెన్నైలోని సీవీ షణ్ముగం ఆఫీసులో 35మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. వీరంతా విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో అన్నాడీఎంకే మొత్తం 47 స్థానాలు కైవసం చేసుకోగా అందులో 35మంది టీవీకేకు మద్దతు ప్రకటించేందుకు రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. సమావేశం తరవాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ప్రకటిస్తే ఆయన రేపే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా లేదంటే మరో ముహూర్తం వెతుక్కుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.






