AIADMK: ఊసరవెల్లిగా మారింది..డీఎంకేపై పళనిస్వామి విమర్శలు

by Shamantha N |
AIADMK: ఊసరవెల్లిగా మారింది..డీఎంకేపై పళనిస్వామి విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అధికార డీఎంకేపై అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి(EPS) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తున్నదని విమర్శించారు. అన్నాడీఎంకే(AIADMK Walkout) వరుసగా రెండో రోజు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసింది. అధికార పార్టీ ‘ఊసరవెల్లి’గా మారిందని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో వివాదస్పద మంత్రులైన కే పొన్ముడి, కెఎన్ నెహ్రూ, వీ సెంథిల్ బాలాజీలపై అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు అన్నాడీఎంకే సభ్యులు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఎం.అప్పావు అందుకు నిరాకరించారు. దీంతో నిరసనగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను స్టాలిన్ కాపాడుతున్నారని పళనిస్వామి ఆరోపించారు. సీఎం స్టాలిన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ‘వారి ద్వంద ప్రమాణాలకు ఇది నిదర్శనం. రాజకీయ సౌలభ్యం కోసం రంగులు మార్చే ‘ఊసరవెల్లి’గా డీఎంకే మారింది’ అని మండిపడ్డారు.

అసెంబ్లీ నుంచి వాకౌట్

కాగా, తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత డీఎంకే కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు నిరసన చేపట్టింది. "ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది?.. ప్రజాసమస్యలు లేవనెత్తడానికి అనుమతి లేదా?" అంటూ నినాదాలు చేశారు.అంతే కాకుండా, 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భవిష్యత్ రాజకీయ అమరికల గురించి కూడా అన్నాడీఎంకే సూచించింది. "ఎన్నికలు మాత్రమే మా కూటమి బలాన్ని నిర్ణయిస్తాయి. డీఎంకేకు వ్యతిరేకంగా ఐక్యంగా ఓటు వేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని పళనిస్వామి అన్నారు. "బీజేపీ ఇప్పటికే మాతో చేరింది. ఇంకా చాలా మంది అన్నా డీఎంకే- బీజేపీ కూటమిలోకి వస్తారు" అని అన్నారు.

Next Story

Most Viewed