AIADMK: కేవలం ఎన్నికల వరకే బీజేపీతో పొత్తు.. పళనిస్వామి కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

AIADMK: కేవలం ఎన్నికల వరకే బీజేపీతో పొత్తు.. పళనిస్వామి కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి (Palani swamy) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమ పార్టీ పొత్తు కేవలం ఎన్నికల కోసమేనని, ఎలక్షన్స్‌లో కూటమి విజయం సాధిస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోదని తెలిపారు. బుధవారం ఆయన చెన్నయ్ లో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిందిది ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కానీ దాని అర్థం సంకీర్ణ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీతో అధికారాన్ని పంచుకునే అవకాశం లేదన్నారు.

జాతీయ స్థాయిలో ఈ కూటమికి ప్రధాని మోడీ నాయకత్వం వహిస్తారని, తమిళనాడులో మాత్రం నేనే నాయకత్వం వహిస్తానన్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరే ఓట్లు చీలిపోకుండా చూసుకునేందుకే ఏఐఏడీఎంకే బీజేపీని తమ కూటమిలోకి చేర్చుకుందన్నారు. పళనిస్వామి వ్యాఖ్యలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్ర స్పందించారు. అమిత్ షా, పళనిస్వామి కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Next Story