AI training: ఒడిశా అధికారులకు ఏఐ శిక్షణ.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

by B.Srinivas |

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణతయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని అధికారులకు (ఏఐ) శిక్షణ తీసుకోవడం తప్పనిసరి చేసింది.

AI training: ఒడిశా అధికారులకు ఏఐ శిక్షణ.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా (Odisha) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని అధికారులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) శిక్షణ తీసుకోవడం తప్పనిసరి చేసింది. దీని కోసం మూడు నెలల ఆన్ లైన్ ఏఐ కోర్సును అందించేందుకు సిద్ధమైంది. పాలనలో సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ఈ డిసిషన్ తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ మనోజ్ అహుజా (Manoj ahujaa) అధికారులకు లేఖ రాశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లందరూ మూడు నెలల ఆన్ లైన్ ఏఐ కోర్సు నేర్చుకోవాలని ఆదేశించారు. ఈ కోర్సు నేర్చుకునేందుకు అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్ సవాళ్లకు అధికారులను సిద్ధం చేసేందుకు ఏఐ ట్రెయినింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

‘భవిష్యత్ అడ్మినిస్ట్రేటివ్ రూపొందించడంలో ఏఐ వంటి కొత్త ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంతో పౌరులు సులభంగా సంభాషించడం మొదలుకొని ఫిర్యాదుల పరిష్కారం వరకు ఏఐతోనే జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియజేసే పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చే సామర్థ్యం ఏఐకి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తామని, ఆచరణాత్మక విధానాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించినట్టు వెల్లడించారు.

Next Story