లవర్ మోసం చేసిందని సోషల్ మీడియాలో సూసైడ్ నోట్... ప్రాణాలు కాపాడిన ఏఐ

by Ajay Maddhiboyina |

ప్రేమించిన యువ‌తి మోసం చేసింద‌ని ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డ‌గా మెటాకు చెందిన ఏఐ అత‌డి ప్రాణాలు కాపాడింది. ఈ ఘ‌ట‌న యూపీలోని అజంగ‌ఢ్‌లో చోటు చేసుకుంది.

లవర్ మోసం చేసిందని సోషల్ మీడియాలో సూసైడ్ నోట్... ప్రాణాలు కాపాడిన ఏఐ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువ‌తి మోసం చేసింద‌ని ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డ‌గా మెటాకు చెందిన ఏఐ అత‌డి ప్రాణాలు కాపాడింది. ఈ ఘ‌ట‌న యూపీలోని అజంగ‌ఢ్‌లో చోటు చేసుకుంది. జూలై 3న 19ఏళ్ల యువకుడు తన ప్రేయసి మోసం చేసిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన జీవితంతో ఆడుకుని మోసం చేసిందని పేర్కొన్నాడు. అందుకే ఈ రోజు ఉరి వేసుకోబోతున్నా, నా చావుకు ఆ అమ్మాయే కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రాత్రి ఒంటిగంటకు యువకుడు పోస్టు పెట్టగా మెటా ఏఐ వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది.

దీంతో పోలీసులు యువకుడి మొబైల్ నంబర్ ఆధారంగా అతడి లొకేషన్ గుర్తించి అజంగఢ్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పావై పోలస్ స్టేషన్ నుండి ఎస్సై యువకుడి ఇంటికి చేరుకోగా అప్పుడే బాధితుడు ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఎస్సై కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి యువకుడిని కాపాడారు. తాను ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకుంటుండటంతో మత్తుపధార్థాలకు బానిసయ్యాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Next Story