- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: ఏఐతో తీర్పులు ఇవ్వొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏఐ వాడకంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వడంతో ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Ai) వాడకంపై కేరళ హైకోర్టు (Kerala high court) కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వడంతో ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, న్యాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయవ్యవస్థ ఏఐని పరిమితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించింది. ఏఐ సాధనాలకు సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించొచ్చని, కానీ తీర్మానం చేయడానికి, ఆదేశాలు ఇవ్వడానికి, తీర్పులు ఇచ్చేందుకు ఏఐని వాడొద్దని స్పష్టం చేసింది. న్యాయపరమైన బాధ్యత పూర్తిగా న్యాయమూర్తులపైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఏఐ వాడకంలో జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే వాటిలో లోపాలుండే చాన్స్ ఉందని హెచ్చరించింది.
ఏఐ టూల్స్ ఉపయోగించే ముందు జ్యుడీషియల్ అకాడమీ లేదా హైకోర్టు నిర్వహించే ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాక ఆమోదించబడిన ఏఐ సాధనాలు మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. వాటి ఫలితాలను సైతం పర్యవేక్షించాలని పేర్కొంది. ఏఐ వాడకంలో ఏదైనా లోపాన్ని గమనించినట్టైతే వెంటనే హైకోర్టు ఐటీ విభాగానికి తెలియజేయాలని కోరింది. ఏఐ వినియోగానికి సంబంధించి దేశంలోని ఒక హైకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. న్యాయ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.






