- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హెల్త్ కు ఎదురుదెబ్బ.. క్యాష్‌లెస్ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల సంఘం వార్నింగ్!
క్యాష్ లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ( AHPI ) రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే

దిశ, వెబ్ డెస్క్ : భారత దేశంలో ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నప్పటికీ... స్టార్ హెల్త్ కు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి స్టార్ హెల్త్ కు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అక్రమ పద్ధతులను అవలంబిస్తోందని... ఈ కంపెనీ పై అనేక ఆరోపణలు వచ్చాయట. దీంతో ఈ సంస్థకు సంబంధించిన క్యాష్ లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ( AHPI ) రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం కూడా వార్నింగ్ ఇచ్చింది.
15 వేలకు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న... ఏహెచ్పిఐ ( AHPI ), స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22వ తేదీ లోపు... ఒక ఒప్పందానికి రావాలని పేర్కొన్నారు. లేనియెడల... స్టార్ హెల్త్ పాలసీదారులకు సంబంధించిన క్యాష్ సేవలను నిలిపివేస్తామని ప్రకటన చేశారు. గతంలో కేర్ హెల్త్, బజాజ్ ఆలయన్స్, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ... ఏహెచ్ పిఐ తో... దీనిపై చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నాయి.
క్లారిటీ ఇచ్చిన స్టార్ హెల్త్
క్యాష్ లెస్ సేవలపై తాజాగా స్టార్ హెల్త్ క్లారిటీ కూడా ఇచ్చింది. తమ నెట్వర్క్ భాగస్వామ్యంలో నుంచి గ్యాస్ సేవలు నిలిచిపోయినట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరణ ఇచ్చింది. కేవలం బెదిరింపుల కోసమే ఏహెచ్ పిఐ ఈ ప్రకటన చేసినట్లు ఉందని వెల్లడించింది. ఒకవేళ క్యాష్ లెస్ సేవలు నిలిచిపోయినప్పటికీ... ఆసుపత్రికి చెల్లించడానికి ముందే క్లైమ్ డబ్బులు వారికి అందేలా చూస్తామని ప్రకటన చేసింది స్టార్ హెల్త్.






