Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రెండు భారీ భవనాలకు మంటలు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-12 11:03:52  IST  )

గుజరాత్ లోని, అహ్మదాబాద్ లో మేఘాని గుజ్ సెల్ ఎయిర్పోర్టు(Meghani Gujsel Airport) సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Flight Crash) కుప్పకూలింది.

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రెండు భారీ భవనాలకు మంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని, అహ్మదాబాద్(Ahmedabad Plane Crash) లో మేఘాని గుజ్ సెల్ ఎయిర్పోర్టు(Meghani Gujsel Airport) సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Flight Crash) కుప్పకూలింది. ఈ ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani)తోపాటు 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మధ్యాహ్నం 1.39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ టైమ్‌లోనే ఫ్లైట్ కూలినట్లుగా అధికారులు వెల్లడించారు. సివిల్‌ ఆసుపత్రి సమీపంలో ఓ పెద్ద చెట్టును ఢీకొని, బీజె మెడికల్ కాలేజీ బిల్డింగ్, జనావాసాలపై ఫ్లైట్ ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో కాలేజ్ బిల్డింగ్ తోసహ రెండు భారీ భవనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భవనాల్లో నివాసితులు పరిస్థితి గురించి వివరాలు ఇంకా తెలియ రాలేదు. మరోవైపు విమాన ప్రమాద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా NDRF బృందాలు సహ్యక చర్యలు చేపట్టాయి. స్థానిక ఆసుపత్రుల్లో చేరుతున్న క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Next Story