- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash: ఆసుపత్రిలో క్షతగాత్రులు..టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విమానం ( Air India Plane Crash) కూలిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు కుప్పకూలి ఒక్కసారిగా

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విమానం ( Air India Plane Crash) కూలిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు కుప్పకూలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఏకంగా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి 9 ఫైర్ ఇంజన్లను దించారు.
అటు క్షత గాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది. స్ట్రెక్చర్ పైన... క్షతగాత్రులను చాలా వేగంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు.. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు చెబుతున్నారు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది. 18005691444 నెంబర్ను క్షతగాత్రుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసింది. ఇక అటు ప్రమాదం జరిగిన విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Former Gujarat CM Vijay Rupani) కూడా ప్రయాణించినట్లు చెబుతున్నారు.
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిరిండియా విమానంలోని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు https://t.co/rQjApwru7X pic.twitter.com/jwIYtkXcZ8
— Telugu Scribe (@TeluguScribe) June 12, 2025






