- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ ఆరా
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmadabad Flight Accidend)పై ప్రధాని మోడీ(PM Modi) ఆరా తీశారు.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(ahmedabad plane crash)పై ప్రధాని మోడీ(PM Modi) ఆరా తీశారు. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రమాద పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని తెలిపినట్టు సమాచారం. అలాగేకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ప్రధాని ఫోన్లో మాట్లాడారు. కాగా ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. హుటాహుటిన అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లారు.
గుజరాత్ లోని, అహ్మదాబాద్ లో మేఘాని గుజ్ సెల్ ఎయిర్పోర్టు(Meghani Gujsel Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight Accident) కుప్పకూలింది. ఈ ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani)తోపాటు 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






