- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : మృత్యుంజయుడు రమేష్ ఏం చెప్పాడంటే?
అహ్మదాబాద్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Boeing)కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం(Boeing 787-8 Dreamliner Flight) టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 200 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు బతికి బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్(Ramesh Viswad Kumar).
స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. "టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే పెద్ద శబ్దంతో విమానం కూలిపోయింది. మంటలు అంటుకోకముందే నేను బయటికి దూకేశాను. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. ఆ తర్వాత నా చుట్టూ ఉన్నవారి ఛిద్రమైన, కాలిపోతున్న దేహాలను చూసి భయం వేసింది. నా సోదరుడు ఏమయ్యాడో తెలియదు.. " అని తెలిపారు. బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ 20 ఏళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. తన ఫ్యామిలీని చూసేందుకు ఇండియాకు వచ్చి, తన సోదారునితో కలిసి తిరిగి యూకే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే రమేష్ సోదరుడు విశ్వాస్ జాడ తెలియరాలేదు.






