- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్... ప్రపంచ దేశాధినేతల సంతాపం
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో ప్రయాణికులంతా మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో ప్రయాణికులంతా మృతి చెందారు. సిబ్బంది సహ 242 మంది ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఈ దుర్ఘటనపై ప్రపంచ దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. హృదయవిదారక ఘటనగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఘటనపై చింతిస్తున్నానని తెలుపుతూ, వీలైనంత ఎక్కువమంది ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నానని అన్నారు.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు స్పందిస్తూ.. విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్-3 దంపతులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని ప్రకటించారు.






