- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. మృతదేహాల అప్పగింతకు 72 గంటలు?
అహ్మదాబాద్‌లో (Ahmedabad Plane Accident) జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటనలో (airindia Plane Crash) ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగి ఉన్నాయి. ప్రియమైన వారిని కోల్పోయిన బాధతో కుమిలిపోతున్న వారు, మృతదేహాల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుర్దశను ఎదుర్కొంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో (Ahmedabad Plane Accident) జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటనలో (airindia Plane Crash) ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగి ఉన్నాయి. ప్రియమైన వారిని కోల్పోయిన బాధతో కుమిలిపోతున్న వారు, మృతదేహాల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుర్దశను ఎదుర్కొంటున్నారు. ప్రమాదం జరిగి 30 గంటలు గడిచినప్పటికీ.. అధికారులు కేవలం ఆరు మృతదేహాలను మాత్రమే బాధిత కుటుంబాలకు అప్పగించగలిగారు.
ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులతో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారడంతో, డీఎన్‌ఏ పరీక్షలే ఏకైక మార్గంగా మిగిలాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధిత కుటుంబాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అధికారులు వారి నుండి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నప్పటికీ, ఫలితాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాలని సూచించడంతో కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గాంధీనగర్‌లో రెండు, అహ్మదాబాద్‌లో ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ (Forensic Lab)లో ఈ నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఒక వైద్య అధికారి తెలిపారు. "మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ సరిపోలిక ఒక్కటే ఆధారం. ఈ ప్రక్రియకు 72 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు" అని గుజరాత్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆలస్యం కారణంగా.. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఎదురుచూపులతో కాలం గడుపుతున్నాయి.






