Death Sentence: ఏడేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

by Naga Rani Yarlagadda |

మైనర్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో విలేజ్ వాచ్ మెన్ కు ఆగ్రా పోక్సో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Death Sentence: ఏడేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం మరణశిక్ష (Death Sentence)విధించింది. గతేడాది డిసెంబర్ 30న బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా.. వాచ్ మెన్ రాజ్ వీర్ ఆమెకు మాయమాటలు చెప్పి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను నీటిలో ముంచి చంపేందుకు ప్రయత్నించగా.. అది విఫమైంది. పక్కనే ఉన్న బండరాయితో దారుణంగా కొట్టడంతో.. ఆమె తీవ్రగాయాలతో మరణించింది. బాలిక మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేసి.. నిందితుడు రాజ్ వీర్ పరారయ్యాడు.

బాలిక మిస్సైనట్లు తల్లిదండ్రులు, స్థానికులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మ నేతృత్వంలో గాలించగా.. బాలిక మృతదేహం లభ్యమైంది. హత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో నిర్థారణవ్వగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలంలో లభించిన జుట్టు అతని డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడంతో కేసు బలపడింది. సాక్ష్యులు కూడా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగా.. ఆగ్రా పోక్సో కోర్టు (Agra Pocso Court) ప్రత్యేక జడ్జి సోనికా చౌదరి సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు వెలువరించారు. నిందితుడు రాజ్ వీర్ కు మరణశిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధించారు. తమకు న్యాయం చేసినందుకు బాధితురాలి తండ్రి కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story