- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Agniveers: పోలీస్ పోస్టుల్లో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్.. సిక్కిం ప్రభుత్వం నిర్ణయం
సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem singh thamang) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్ లో గురువారం నిర్వహించిన ‘షేర్‌డ్ విజన్ ఫర్ వికసిత్ భారత్-2047 మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ 2025’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. సిక్కిం పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో అగ్నివీర్లకు 20 శాతం కోటా ఉంటుందని, సర్వీస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి వయో సడలింపు ఉంటుందని చెప్పారు. సాయుధ దళాల్లో కనీసం ఆరు నెలలు పూర్తి చేసిన మాజీ సైనికులకు ప్రామాణిక గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపును ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
దీని వల్ల వారు 50 ఏళ్ల వయసు వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. భారత సైన్యం మన సరిహద్దులను భద్రపరచడంలో మాత్రమేగాక, రాష్ట్ర సామాజిక-ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌తో అగ్నివీరులుగా ఎన్నికైన వారి తొలి బ్యాచ్ పదవీ కాలం 2026లో పూర్తి కానుంది. దీంతో అగ్నివీరులకు పోలీస్ శాఖల్లో రిజర్వేషన్ ఖరారు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాక ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిక్కిం సీఎం కీలక ప్రకటన చేయడం గమనార్హం.






