- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాప్తాడు వైసీపీ నేత నరేంద్ర ఆత్మహత్యాయత్నం... ఆయనే కారణమంటూ సెల్ఫీ వీడియో
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత అంకె నరేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ...

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత అంకె నరేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తాగడంతో నరేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
అయితే ఆత్మహత్యకు ముందు అంకె నరేంద్ర సెల్ఫీ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాప్తాడు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ జరిగింది. ఇందులో టీడీపీ నేత ఆలమూరి గోనుగుంట్ల సూర్యనారాయణ అక్రమంగా దొంగ ఓట్లను నమోదు చేయించారని నరేంద్ర ఆరోపించారు. అంతేకాదు ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. ఈ కక్షతోనే తనపై పగబట్టి హౌసింగ్ ఏఈ సంపత్ కుమార్‌తో కుమ్మక్కై మోటార్ల దొంగతనం కేసు పెట్టించారని నరేంద్ర ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయకపోయినా దొంగలుగా చిత్రీకరిస్తూ, చివరకు తమ ఇంటిని కూడా కూల్చివేసేందుకు కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల వేధింపులు తాళలేకే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో నరేంద్ర వాపోయారు.






