- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహార భద్రత చట్టానికి సవరణలు విరమించుకోవాలి.. ఎన్‌పీఆర్‌డీ
మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్న యోజన కింద కుటుంబానికి ఇస్తున్న 35 కిలోల బియ్యాన్ని తగ్గించడం పేదలు, ముఖ్యంగా వికలాంగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు.
అర్హులైన వికలాంగుల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న విధంగానే 35 కిలోల బియ్యం కొనసాగించాలని, 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సవరణలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి కె. యశోద, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.దుర్గ, జిల్లా ఉపాధ్యక్షులు టి. యాదగిరి, కవిత, కె. చంద్రం, గుమ్మడిదల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు సంతోష్, పి. శ్రీనివాస్, ఎల్లం, వెంకన్న, జిల్లా నాయకులు దాసు, సాయిలు, ఏఐఏడబ్ల్యయూ జిల్లా నాయకులు యేసయ్య, నహీం, అజహర్, మైసమ్మ తదితరులు పాల్గొన్నారు.






