వైన్ షాపుకు జరిమానా విధించిన గ్రామపంచాయతీ...

by Kodari Anjali |

పార్కింగ్ ప్లాస్టిక్ పారిశుద్ధ్యం పాటినందుకు వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జరిమానా విధించారు.

వైన్ షాపుకు జరిమానా విధించిన గ్రామపంచాయతీ...
X

దిశ, ధర్మసాగర్: హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ఒక వైన్స్ షాప్ రోడ్డుపై వాహనాలు నిలుపుదల, ప్లాస్టిక్ గ్లాసులు, బాటిల్స్ రోడ్డుపై, డివైడర్‌లో వేసినందుకు, పారిశుద్ధ్యం పాటించనందకు వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, బిల్లా యాదగిరి ఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి విజయ షాపును విజిట్ చేసి 5000 రూపాయల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా సర్పంచ్, కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామంలోని వివిధ షాపులు నిర్వహిస్తున్న యజమానులు విధిగా షాపు ముందు పార్కింగ్ స్థలాన్ని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేయాలని, తూనికలు కొలతల నాణ్యత, పాటించాలని, లేనియెడల గ్రామపంచాయతీ వారు చట్ట ప్రకారం సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story