అగ్ని-5 ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

by Malleboina Mahesh |   (  Updated:2025-08-20 14:43:20  IST  )

ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి అగ్ని-5 ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగం విజయవంతం అయింది.

అగ్ని-5 ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (Integrated Test Range) నుండి అగ్ని-5 ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని (Agni-5 intermediate-range ballistic missile) ప్రయోగం విజయవంతం అయింది. వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం, క్షిపణి యొక్క అన్ని లక్ష్యాలు, సాంకేతిక పరిమితులను ధృవీకరించిందని అధికారులు తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన అగ్ని-5, 5,000 కిలోమీటర్లకు పైగా పరిధి కలిగిన అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి. ఇది అగ్ని సిరీస్‌లో అత్యంత అధునాతనమైనది.

మల్టిపుల్ ఇండిపెండెంట్‌గా టార్గెట్ ను చేరుకునేందుకు రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) టెక్నాలజీతో అమర్చబడిన అగ్ని-5 బహుళ అణు వార్‌హెడ్‌లను మోయగలదు. అలాగే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి వేర్వేరు లక్ష్యాన్ని ఛేదించగలదు. తద్వారా దాని వ్యూహాత్మక ప్రభావాన్ని బాగా పెంచుతుంది. ఖచ్చితత్వం కోసం ఈ మిస్సైల్.. రింగ్ లేజర్ గైరోస్కోప్-ఆధారిత నావిగేషన్ సిస్టమ్ (RLG-INS), మైక్రో నావిగేషన్ సిస్టమ్ (MINGS) లను ఉపయోగిస్తుంది, దీనికి భారతదేశ NavIC, US GPS వంటి ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు మద్దతు ఇస్తాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం.. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచిస్తుంది.

Next Story