- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
boAT: కేంద్రమంత్రికి మద్దతుగా బోట్ కో ఫౌండర్..!
స్టార్టప్ లపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాగా.. ఇలాంటి సమయంలో పీయూష్ కు బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా మద్దతు పలికారు.

దిశ, నేషనల్ బ్యూరో: స్టార్టప్ లపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాగా.. ఇలాంటి సమయంలో పీయూష్ కు బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా మద్దతు పలికారు. అమన్ గుప్తా కేంద్రమంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. పీయూష్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పు ఏమీ కనిపించలేదంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖలకు వక్రార్థాలు తీయాల్సిన అవసరం లేదన్నారు. పీయూష్ మాట్లాడిన మొత్తం స్పీచ్ తాను విన్నానని, అందులో తప్పులు వెతకాల్సిన పని లేదన్నారు. పీయూష్ మాట్లాడుతూ.. ‘స్టార్టప్ ఫౌండర్లకు మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలని ప్రతిరోజూ గవర్నమెంట్ చెప్పలేదు. నేను అక్కడ ఉన్నాను. ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. కేంద్రమంత్రి కంపెనీల వ్యవస్థాపలకు వ్యతిరేకం కాదు. మనపై నమ్మకం ఉంది కాబట్టే కొన్ని మంచి విషయాలు చెప్పారు. భారత్ ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే వాటిని సాధించడానికి కృషి చేస్తామనేది ఆయన చెప్పిందాంట్లో నాకు అర్థమైంది’ అంటూ అమన్ గుప్తా పేర్కొన్నారు.
కేంద్రమంత్రి ఏమన్నారంటే?
ఇటీవల జరిగిన స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్ మాట్లాడారు. దేశంలోని పలు స్టార్టప్ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయి. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. మన స్టార్టప్‌లు ఐస్‌క్రీమ్‌లు, చిప్స్ తయారీ వద్దే ఆగిపోకుండా చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టి సారించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను జెప్టో సీఈఓ అదిత్ పలిచా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు తప్పుబట్టారు. ఉద్యోగాల సృష్టి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో జెప్టో విజయం సాధించిందని, భారత ఆవిష్కరణల్లో ఇది అద్భుతమని అదిత్ పలిచా పేర్కొన్నారు. ఇంజినీర్‌లు, టెక్నాలజిస్ట్‌లు సవాల్‌గా తీసుకోవాలని, విమర్శగా భావించకూడదని జోహో వెంబు అన్నారు. దేశీయ స్టార్టప్ లపై గోయల్ నమ్మకం ఉంచాలని, డీప్-టెక్ స్టార్టప్ లకు చేయుతనివ్వాలని మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు.






