- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పాకిస్తాన్‌కు 'రెడ్‌లైన్' గీసిన భారత్
దీని ద్వారా భారత ప్రభుత్వం గానీ, భారత సైన్యం గానీ సిద్ధాంతపరమైన మార్పునకు సిద్ధమవ్వాలనే మెసేజ్‌ను పాక్‌కు పంపింది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్తాన్‌కు రెడ్‌లైన్ గీసింది. ఉగ్రవాద విధానాన్ని అనుసరించే పాకిస్తాన్ రానున్న రోజుల్లో 'ఆపరేషన్ సిందూర్' లాంటి దాడులకు అనుక్షణం సిద్ధంగా ఉండక తప్పని పరిస్థితి తెచ్చుకుంది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా సరే పాక్‌పై యుద్ధం తప్పదనే ప్రధాని మోడీ ప్రకటన ఇందుకు బలాన్నిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై, వైమానిక స్థలాలు, పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై భారత్ క్రూయిజ్ క్షిపణి దాడులు చేసింది. దీని ద్వారా భారత ప్రభుత్వం గానీ, భారత సైన్యం గానీ సిద్ధాంతపరమైన మార్పునకు సిద్ధమవ్వాలనే మెసేజ్‌ను పాక్‌కు పంపింది. దీనర్థం.. ఆపరేషన్ సిందూర్ ఇంతటితో ముగియలేదు, ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేందుకు భారత్ ఇకపై దాడులను సాధారణమని సంకేతమించింది. భారత సరిహద్దుల్లో ఎలాంటి అలికిడి అయినా భారత్ యుద్ధం తరహాలో బదులివ్వనుంది. దీన్ని పాకిస్తాన్ అంగీకరించక తప్పదని, ఎలాంటి సంప్రదింపులకు అవకాశం ఉండదని భారత ప్రభుత్వంతో పాటు, మన సైన్యం ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది.
మే 7న భారత్ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వ్యాప్తనా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన స్థావరాలు కూడా ఉన్నాయి. ఈ స్థావరాలు భారత్‌పై దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించే కీలకమైన శిక్షణ కేంద్రాలుగా భారత్ గుర్తించింది. ముఖ్యంగా భారత సైన్యం పాక్ సైనిక స్థావరాలు లేదా పౌరులను లక్ష్యం చేసుకోకపోవడం దీనికి మరింత ఊతమిస్తుంది. సాధ్యమైనంత వరకు భారత్ భారీ నష్టం జరగకుండా, ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. అయితే, పాకిస్తాన్ సైన్యం డ్రోన్‌లతో మన దేశంలోని పౌరులపై దాడులు తెగబడటం వల్ల పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. వరుస దాడుల తర్వాతే, భారత సైన్యం పాక్‌కు దెబ్బ తగలాల్సిన చోట్ల ప్రతిదాడి చేసింది.
ఈ విషయాన్నే ఆదివారం ప్రకటనలో ఎయిర్ ఆపరేషన్స్ డీజీ ఎయిర్ మార్షల్ ఏకె భారతి విలేకరుల సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్ చేసిన దాడులకు బదులుగానే వేగంగా, సమన్వయంతో, ఖచ్చితమైన లక్ష్యాలతో ప్రతిదాడి చేశాం. పశ్చిమ సరిహద్దు అంతటా వైమానిక స్థావరాలు, కమాండ్ కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేసినట్టు వివరించారు. దీని ద్వారా దూకుడుగా వ్యవహరిస్తే సహించేది లేదనే స్పష్టమైన సందేశమిచ్చామని వెల్లడించారు.






