- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కశ్మీర్‌లో టెన్షన్ టెన్షన్..బంకర్లను సిద్దం చేసుకుంటున్న ప్రజలు
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ కశ్మీర్ ను జల్లెడ పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ కశ్మీర్ ను జల్లెడ పడుతోంది. ఉగ్రవాద స్థావరాలకు వెతుకుతూ దాడులు చేస్తోంది. మరోవైపు యుద్దం జరిగే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. సైనికులకు తాము అడ్డుగా ఉండవద్దని వారికి పూర్తిగా సహకరిస్తామని బంకర్లను సిద్దం చేసుకుంటున్నారు. ఒకవేళ దాడులు జరిగితే ప్రమాదం జరగకుండా బంకర్లలో ఉండేందుకు వాటిని ముందుగానే సిద్దం చేసుకుంటున్నారు.
సాధారణంగా శత్రు దేశాల నుండి దాడులు జరిగినప్పుడు ప్రజలు ఇలా బంకర్లలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటారు. ఇదిలా ఉంటే కశ్మీర్‌లో ప్రజలు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. స్థానికుల సహకారం లేనిది ఉగ్రవాదులు ఎలా వచ్చారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే కొంతమంది ఉగ్రవాదులకు సహకరించేవారు ఉన్నా చాలా మంది కశ్మీరీ ప్రజలు టూరిస్టులకు సాయం చేశారు. దాడి తరవాత వారిని ఉచితంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓ గుర్రం నడిపే వ్యక్తి ఏకంగా టూరిస్టులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులతో వాదించి తన ప్రాణాలు సైతం త్యాగం చేశాడు. ఇప్పుడు ముందుగానే సైనికులు తమ గురించి ఆందోళన చెందవద్దని బంకర్లు సిద్దం చేసుకుంటూ అందరి మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు.






