- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: ట్రంప్ టారీఫ్ దెబ్బకు చైనా విలవిల.. పొరుగుదేశాలతో సత్సంబంధాలకోసం ప్రయత్నాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ దెబ్బకు చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Xi Jinping) పర్యటనలకు రెడీ అవుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ దెబ్బకు చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Xi Jinping) పర్యటనలకు రెడీ అవుతున్నారు. ప్రాంతీయ సహకరాన్ని పెంపొందించుకునేందుకు పర్యటనలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14 నుంచి 18 వరకు వియత్నాం, మలేసియా, కంబోడియా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాలకు ఆసియాన్ గ్రూప్‌లో సభ్యత్వం ఉంది. ఈ గ్రూప్‌నకు చైనాకు మధ్య ఏటా 962 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. దీనిలో 575 బిలియన్ డాలర్లు చైనా ఎగుమతులే ఉంటున్నాయి.
145 శాతం సుంకాలు..
అమెరికా చైనాపై ఏకంగా 145 శాతం సుంకాలు విధించడంతో.. బీజింగ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ట్రంప్ టారీఫ్ లపై చాలా దేశాలు ఆచితూచి వ్యవహరించాయి. కానీ చైనా మాత్రం అగ్రరాజ్యంపై 84 శాతం పన్నులు విధించింది. దీంతో, అమెరికా బీజింగ్ పై 145 శాతానికి పన్నులను పెంచింది. దీంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. అమెరికా బెదిరింపులకు తగ్గబోయేది లేదన్న ట్రాగన్.. టారీఫ్ లకు వ్యతిరేకంగా ఫిల్మ్ ల దిగుమతులను తగ్గించింది. అమెరికా వాణిజ్య యుద్ధం చేయాలనుకుంటే.. ఆఖరివరకు పోరాడతామని చైనా పేర్కొంది. ఒత్తిళ్లు, బ్లాక్ మెయిల్స్, బెదిరింపులు సరైన మార్గం కాదంది.






