- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UP Businessman: గూఢచర్యం కేసులో యూపీకి చెందిన వ్యాపారవేత్త అరెస్టు
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించి అధికారులు అరెస్టులు చేస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించి అధికారులు అరెస్టులు చేస్తున్నారు. ఇటీవలే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన అధికారులు.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని రాంపూర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ షాజాద్ ను గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పేర్కొంది. అతడు పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ.. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అంతేకాకుండా, సున్నితమైన సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని పేర్కొన్నారు. పాక్‌కు కాస్మోటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు.
ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్ లో..
అంతేకాకుండా, షాజాద్ భారత్‌లో పలు సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పలువురు యువకులను ప్రోత్సహించి ఐఎస్‌ఐలో చేరడానికి పాక్‌కు పంపించేవాడని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, పాక్ కు వెళ్లేవారి కోసం వీసాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గూఢచర్యం కేసులో ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ముష్కరుల కోసం జమ్మూకశ్మీర్ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని.. పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు.






