- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
President Murmu : భారత రాష్ట్రపతి ముర్ముకు తూర్పు తైమూర్ అత్యున్నత పౌర పురస్కారం
దిశ, నేషనల్ బ్యూరో : తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అందుకున్నారు. తూర్పు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా ఆమెను ఈ పౌర పురస్కారంతో సత్కరించారు. సామాజిక సేవ, విద్యారంగం, మహిళల సాధికారతా విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే’ వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ అవార్డును స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ‘‘భారత్ - తూర్పు తైమూర్ మధ్యనున్న బలమైన సంబంధాలకు ఈ పురస్కార ప్రదానం అనేది ఒక ప్రతిబింబం లాంటిది’’ అని చెప్పారు. ఫిజి, న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని భారత రాష్ట్రపతి తూర్పు తైమూర్ దేశ రాజధాని దిలికి చేరుకున్నారు. ఆ వెంటనే భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముర్ము నివాళులర్పించారు. ఈసందర్బంగా దిలీలోని ప్రవాస భారతీయులతో సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు తైమూర్ అధ్యక్షుడితో భారత రాష్ట్రపతి భేటీ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ప్రధాన చర్చ జరిగింది.